స్వతంత్ర వెబ్ డెస్క్: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. విక్టరీ వెంకటేశ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 225 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన విడుదలై తొలి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద 182 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ‘జీ5 గ్లోబల్’లోకి వచ్చిన సల్మాన్ చిత్రం బుల్లితెరపై మాత్రం సంచలనాలు సృష్టిస్తోంది. ఓటీటీలోకి వచ్చిన తొలి రోజే అద్భుత ఆదరణ దక్కించుకొని రికార్డులు బ్రేక్ చేస్తోంది. మొదటి రోజే అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డును సల్మాన్ చిత్రం బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన తొలి రోజే అత్యధిక వ్యూవర్షిప్ వచ్చిన చిత్రంగా నిలిచింది.
ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలుకొట్టిన సల్మాన్ సినిమా
0
505
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


