ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిద్దిపేట రెడ్డి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో రెడ్లపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఒక్క బీసీ ఓట్లతోనే మల్లన్న గెలవలేదని, బీసీలపై ప్రేమ ఉంటే వారి కోసం కొట్లాడాలన్నారు. మల్లన్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. చిన్నకోడూర్‌తో పాటు పలు పోలీసు స్టేషన్లలలో వారు ఫిర్యాదులు చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి బంధువులు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.