విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డానని.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు. ఈసారి జగన్2.0ని చూడబోతున్నారని అన్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుందని.. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానని చెప్పారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసి చట్టం ముందు నిలబెడతానని జగన్ తెలిపారు.