తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

   తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంలా మారాయి. నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. తెలంగాణలో ఆరు జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో ఉడికాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచి ర్యాల జిల్లా హాజిపూర్‌ మండలాల్లో 45.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ నెలకు సంబం ధించి నల్గొండ జిల్లాలో గత పదేళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. అలాగే నల్గొండ, ఆదిలాబాద్‌ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్‌ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకడం ఇదే మొదటిసారి. దీంతో పాటు ఐదు జిల్లాల్లో 44.9 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదయ్యాయి.

  అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణశాఖ రాష్ట్రానికి వడగాలుల ముప్పునకు సంబంధించి ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.ఇవాళ, రేపు అన్ని జిల్లాల్లో 41-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.అటు ఏపీ కూడా నిప్పులకొలిమిలా మారింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పు లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతు న్నాయి. నిన్న రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావం తో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

Latest Articles

కేశినేని బ్రదర్స్ మధ్య ఏం జరుగుతోంది?

విజయవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ ఎపిసోడ్ మరోసారి హీట్ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ కేశినేని నాని.. మళ్లీ అనూహ్యంగా యాక్టివ్ అవుతున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్