‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రీరిలీజ్.. ప్రతి టికెట్‌పై రూ.10 జనసేనకు: నట్టికుమార్

“కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దంపట్టేవిధంగా ఉంటుందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలైన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ… “ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి సేల్ అయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలు జనసేనకు ఫార్టీ ఫండ్ ను అందజేస్తాం. ఫ్యాన్స్ కు ప్రత్యేక విన్నపం ఏమిటంటే… . అసాంఘిక శక్తులు కావాలని ధియేటర్స్ ను నాశనం చేయాలని చూస్తే, అలాంటి వారిని పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి పట్టించండి. దేవాలయం లాంటి ధియేటర్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. మన నాయకుడికి చెడ్డ పేరు రాకుండా చూడాలి. ఈ సినిమా ఈ సమయంలో రీ రిలీజ్ చేయడానికి కారణం పూర్తి పొలిటికల్ .సబ్జెక్టుతో తీసిందన్న ఉద్దేశ్యమే. ఇది ఆ రోజుల్లోనే పవన్ కల్యాణ్ గారిని పొలిటికల్ విజన్ తో చూపించడం జరిగింది. ఇందులోని డైలాగ్స్ ఇప్పుడు ఎవరికి తగలాలో వారికి తగులుతాయి.. ఈ సినిమా వల్ల పవన్ గారి ఆలోచనలు తెలియాలన్నది మా ఆకాంక్ష. ఎన్నికల ముందు ఎన్నో పొలిటికల్ సినిమాలు వస్తాయి. యాత్ర-2 సినిమా సెన్సార్ అయితే దానిపై న్యాయపోరాటం చేస్తాం. ఏపీలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు అధికారాన్ని కైవసం చేసుకుంటుంది” అని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

గద్దర్ అన్న అవార్డులపై పరిశ్రమలోని వారెవరూ స్పందించకపోవడం కరెక్ట్ కాదు

“తెలంగాణాలో పదేళ్ల నుంచి, ఏపీలో ఐదేళ్లుగా సినిమా వారికి ప్రభుత్వాలు అవార్డ్స్ ఇవ్వలేదు..తెలంగాణాలో గద్దర్ అన్నతో సినిమా అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అభినందనీయం. సినిమాతో పాటు ,నాటకం తదితర రంగాలన్నింటికీ అవార్డులు ఇవ్వాలి. గద్దర్ అన్న పేరుతో అవార్డులు ఇస్తామంటే తెలుగు సినీరంగంలోని పెద్దలు ఎవరూ స్పందించకపోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదో? ఏంటో? తెలియాలి. స్వలాభం కోసం కొందరు ఈమధ్య సిఎం గారిని కలిశారు..ఒక దళిత బిడ్డ , గొప్ప వ్యక్తి పేరిట అవార్డ్స్ ఇస్తామంటే పరిశ్రమలోని వారు నోరు మెదపటం లేదు..కేసిఆర్ గారు తన పాలనలో ఎవరిని పట్టించుకోలేదు..పరిశ్రమలోని వారు కేసిఆర్, జగన్ లను అవార్డ్స్ ఇవ్వమని పరిశ్రమలో అడిగినవారు ఎవరూ లేరు. అడగకుండానే అవార్డ్స్ ను రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు.. త్వరలో కొంతమంది చిన్న నిర్మాతలం కలిసి మా కష్టాలు చెప్పుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నాం. ఏపీలో జగన్ పాలన గురించి షర్మీల చెబుతుంటే… రాజన్న బిడ్డ అని కూడా చూడకుండా ఆమె పై ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిని జగన్ ఖండించటం లేదు” .అని నట్టి కుమార్ అన్నారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్