పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో ఝార్ఖండ్‌లోని ట్రయల్ కోర్టు విచారణపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది.
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గౌరవానికి భంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత నవీన్ ఝా ఫిర్యాదుచేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణను రద్దు చేయాలంటూ ఝార్ఖండ్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు ఊరట లభించింది.