హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధభవన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా.. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చెరువులు, రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జా పై నగర వాసుల ఫిర్యాదులు చేస్తున్నారు. నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి ఫిర్యాదులను అందజేస్తున్నారు బాధితులు. ఓవైపు ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు ఇస్తున్నారు.