స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 8వ తేదీన రానున్న ఆయన.. వరంగల్ లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం వారణాసి నుండి మోడీ హైదరాబాద్ చేరుకుంటారు. మోడీ ఉదయం 9.45 కి హాకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు .అక్కడి నుండి హెలి కాప్టర్ లో వరంగల్ కు 10.35 కి వరంగల్ కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుండి 11.20 వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.30 నుండి 12.10 వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.20 కి వరంగల్ నుండి రిటర్న్ హకీమ్ పేటకు చేరుకుని ఢిల్లీ వెళతారు.
కాగా.. ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 8న హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.