స్వతంత్ర వెబ్ డెస్క్: సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ప్రేమ్ కుమార్’. ఈ సినిమాతో నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… సినిమా టీజర్ విడుదల చేశారు.
‘ప్రేమ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు?’, ‘అరే… ప్రేమ్ కుమార్ ఎక్కడ?’ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. ఆ ప్రేమ్ కుమార్ వచ్చేశాడు. ప్రముఖ నటుడు, కథానాయకుడు ప్రియదర్శి ‘ప్రేమ్ కుమార్ కథ’ పేరుతో సినిమా టీజర్ విడుదల చేశారు.
‘ప్రేమ్ కుమార్’లో సంతోష్ శోభన్ హీరో. ఈ సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఇందులో మరో హీరో కూడా ఉన్నాడు. అతని పేరు కృష్ణ చైతన్య. ‘ప్రేమ్ కుమార్’ కథలో చిత్రసీమ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో అతడు హీరోగా కనిపించనున్నారు. రీల్ లైఫ్‌లోని రీల్ లైఫ్‌లో హీరో అన్నమాట. మెయిన్ హీరోయిన్ రాశీ సింగ్ అయితే… రుచితా సాధినేని రీల్ లైఫ్‌లోని రీల్ లైఫ్‌లో హీరోయిన్ రోల్ చేశారు.
కథగా చూస్తే సంతోష్ శోభన్ హీరో అయితే.. అతనికి విలన్ కృష్ణ చైతన్య. రాశీ సింగ్, రుచితా సాధినేని.. ఇద్దరు హీరోయిన్లు ఎవరిని ప్రేమించారు? ఎవరి ప్రేమ కారణంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తాయి? రుచితా సాధినేని ప్రేమించినది ఎవరని.. సంతోష్ శోభన్‌నా? లేదంటే సినిమాలోని సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చైతన్యనా? రాశీ సింగ్ ఏమనుకుంటుంది? సంతోష్ శోభన్‌ను కృష్ణ చైతన్య ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.