కేశవనగర్‌ బడిని చూస్తే కన్నీళ్లొచ్చాయ్‌..

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఓ మంచి పని చేశాడు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. హైదరాబాద్ నగర శివార్లలోని కేశవనగర్‌లో సర్కారు బడిని దత్తత తీసుకున్న హిమాన్షు.. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో దాన్ని కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దాడు. బుధవారం హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలిసారి జనం ముందుకొచ్చి మాట్లాడిన హిమాన్షు అందర్నీ ఆకట్టుకున్నాడు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎక్కడా తడబడకుండా మాట్లాడిన హిమాన్షు.. తన తాత, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.

‘ఆ పాఠశాల పరిస్థితి చూశాక.. బాధతో కళ్లలో నీళ్లు తిరిగాయన్న హిమాన్షు.. గర్ల్స్ టాయిలెట్ బయట పందులు ఉన్నాయి.. పిల్లలు రాళ్ల మధ్య ఉరుకుతున్నరు.. ఓ పిల్లాడు మెట్ల మీది నుంచి జారి పడ్డడు.. హెడ్ మాస్టర్ ఆఫీసు రూంలో స్టూడెంట్స్ ఉన్నరు.. ఇదే స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్, స్టోర్ రూమ్ కూడా అని చెప్పారు. అది చూసి నేను షాకయ్యా. వంద శాతం ఇది నాకు కొత్త.. ఆ బాధను నేను మాటల్లో చెప్పలేను’ అంటూ హిమాన్షు చెప్పుకొచ్చాడు.

ఈ స్కూల్‌ను దత్తత తీసుకోవడానికి స్ఫూర్తి మా తాత గారు అని సీఎం కేసీఆర్ గురించి హిమాన్షు గొప్పగా చెప్పాడు. గ్రేడ్ తగ్గినా సరే.. వంద మంది పిల్లలకు మంచి జరుగుతుందని అనుకుంటే.. ముందుకెళ్లమని తన తండ్రి ప్రోత్సహించాడని కేటీఆర్ గురించి కూడా హిమాన్షు చెప్పాడు. తొలి పబ్లిక్ స్పీచ్‌తోనే హిమాన్షు ప్రజలను ఆకట్టుకున్నాడు. కానీ అతడి మాటలే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంలా మారాయి. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి చూసి స్వయంగా ఆయన మనవడికే ఏడుపొచ్చింది. కేసీఆర్ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోంది అనడానికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనం.. ఐటీ కారిడార్‌లో ఉన్న పాఠశాల సంగతే ఇలా ఉంటే.. రాష్ట్రంలోని మిగతా సర్కారు బడుల సంగతి ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్