తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేస్తోంది. లడ్డూలో వాడిన నెయ్యి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ కావడంతో కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హిందూ మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని అన్నారు. పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అని ఎద్దేవా చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. దోషులెవరున్నా బయటకు వస్తారని తెలిపారు.