ఏపీలోని దర్యాప్తు, విచారణ సంస్థలతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పలు కేసుల విచారణ, వాటి దర్యాప్తుకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఫైబర్ నెట్, మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం, ఇసుక దోపిడీకి సంబంధించిన కేసులపై ఆరా తీశారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసుపై సీఐడీ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన చర్యలతో పాటు కేసు పురోగతిపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన ఇసుక దోపిడీపైనా విచారణ జరుగుతోంది. దీనిపైన వాకబు చేశారు. మద్యం కుభకోణంపైనా సంబంధిత అధికారులను చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజీత్, విజిలెన్స్ డీజీ, సీఐడీ చీఫ్ హాజరయ్యారు.
దర్యాప్తు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
0
284
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


