కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారారన్నారు. 25వేల కుటుంబాలను రోడ్డున పడేశారని.. లక్షమందిని నిరాశ్రయులను చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే తమకు పట్టాలు వచ్చాయని ప్రజలు చెబుతున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారని చెప్పారు. వంద రోజుల్లోనే హామీలన్ని నెరవేరుస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఇప్పుడెందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.