మూసీ బాధితులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే బహదూర్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోని మహమూద్ నగర్ కిషన్ బాగ్‌లో కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడారు. బాధితులకు అండగా మేముంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. కేటీఆర్ వెంట సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, కౌశిక్ రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.