BRS ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారామె. ఇవాళ సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మళ్లీ ఇప్పుడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారు.