Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

వీవీప్యాట్లను లెక్కించాలని ప్రతిపక్షాల డిమాండ్

       ప్రస్తుతం వీవీప్యాట్ ల అంశం చర్చనీయాంశం అయింది. 2024 పార్లమెంటు ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛగా, పారద ర్శకంగా జరగాలంటే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వీవీప్యాట్ లెక్కింపు జరగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సూచించారు. ఓటర్లు వేసిన ఓట్లను అన్ని వీవీప్యాట్‌లను లెక్కించడం ద్వారా ధృవీకరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఈవీఎంల కంటే బ్యాలెట్ పత్రాలు మెరుగైన విధానం అని వారు పేర్కొన్నారు.

     ఈవిఎంల విధానంలో ఓట్ల నమోదు అమలు లోకి వచ్చినప్పటి నుంచీ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీలు అక్రమాలు జరిగాయని ఆరోపించడం మామూలైంది. దీంతో క్రాస్ చెక్ కోసం వీవీప్యాట్ల లెక్కింపు ట్రయల్స్ కు కోర్టులు సూచిం చాయి. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ – వీవీప్యాట్- వినియోగాన్ని ప్రారంభించినప్పటి నుంచి , ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. 2019 లోక్ సభ ఎన్నికల నుంచి ఈవీఎంలన్నీ వీవీప్యాట్లతో కవర్ అవుతున్నాయి.

    వీవీప్యాట్ లో ముద్రించిన పేపర్ స్లిప్ ను ఓటరు ఈవీఎంలో తన ఓటు నమోదు చేసుకున్న తర్వాత.. ఏడు సెకన్ల పాటు చూడడానికి వీవీప్యాట్ అనుమతిస్తుంది, ఇందులో ఎంపిక చేసిన అభ్యర్థి పేరు, గుర్తు కనిపిస్తాయి. ఆ తర్వాత అది వీవీప్యాట్ సీల్డ్ డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్  స్లిప్పులను ఎన్నికల సంఘం తనిఖీ చేస్తుంది. 2019లో ఈ సౌకర్యం లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల మధ్య వ్యత్యాసాలపై ఎన్నికల సంఘం నుంచి సమాచారం తీసుకుంటామని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గత నాలుగేళ్లుగా ఇంకా సమాధానం ఇవ్వలేదని జూలైలో పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. దాంతో అధికార పార్టీపై విపక్షాల అనుమా నాలు ముమ్మరం అయ్యాయి. 2023లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్లను లెక్కిం చాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలకు పేపర్ ట్రయల్ అనివార్యమని, వీవీప్యాట్ స్లిప్పులన్నింటినీ లెక్కించేలా ఈసీఐని ఆదేశించాలని పిల్ లో అభ్యర్థించారు.

     భారత ఎన్నికల కమిషన్ ఈ డిమాండ్ ను తిరస్కరించింది. ఈవీఎంలు పారదర్శకను ప్రశ్నించిన ఏ సందర్భంలో కూడా ఈవీఎంల లో లోపాలు ఉన్నాయని రుజువుకాలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలను 100 శాతం వెరిఫికేషన్ చేయడం తిరోగమనమని, అది తిరిగి పేపర్ బ్యాలెట్ల ఓటింగ్ విధానానికి వెళ్లడం వంటిదేనని ఎన్నికల సంఘం సెప్టెంబరో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. వీవీప్యాట్ల ద్వారా తమ ఓట్లు పోలైనట్లుగా నమోదయ్యాయని, రికార్డు అయినట్లుగా లెక్కించారని ధృవీకరించే ప్రాథమిక హక్కు ఓటర్లకు లేదని స్పష్టం చేసింది.వీవీప్యాట్ రికార్డులకు వ్యతిరేకంగా ఈవీఎం డేటా క్రాస్ చెకింగ్ స్థాయిని పెంచడం వల్ల ఎన్నికల కమిషన్ పని భారం పెరుగుతుందని నవంబర్ లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంల వినియోగంపై విపక్షాలు ప్రశ్నలు లేవ నెత్తడంతోపాటు ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకొని.. రానున్న 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్ లను లెక్కించే విధంగా ఎన్నికల కమిషన్ ను ఆదేశిం చాలని సుప్రీంకోర్టును కోరింది. అయితే ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అన్ని వీవీప్యాట్లను లెక్కించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నెరవేరే అవకాశం లేనట్లే. 

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్