మణికొండ నెక్నాంపూర్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించిన విల్లాలు కూల్చేస్తున్నారు. నెక్నాంపూర్‌లో ఇప్పటి వరకు 4విల్లాలను హైడ్రా సిబ్బంది కూల్చేసింది. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 13 విల్లాలు నిర్మించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పడిన హైడ్రా ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కొద్ది రోజుల క్రితమే మాదాపూర్లో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి తన దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు పోతుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలనకు వెళ్తున్నారు.