టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే.. ఆయన ఈసారి వివాదస్పద ట్వీట్లతో వార్తల్లో నిలవలేదు. ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర రచయిత, న్యాయవాది అయిన సేథ్ అబ్రమన్స్.. ఎలాన్ మస్క్ కు పిచ్చిపట్టిందని సంచలన ఆరోపణలు చేయడంతో వార్తల్లోకి ఎక్కాడు. మస్క్ ప్రవర్తన గురించి.. అతని ద్వారా యునైటెడ్ స్టేట్స్ కు కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించాడు.
ఎలోన్ మస్క్‌కి పిచ్చి పట్టిందని నేను చట్టబద్ధంగా నమ్ముతున్నాను అని అబ్రామ్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. మానసిక, ఆరోగ్య పోరాటలు, అధికంగా మాదక ద్రవ్యాలను వినియోగించడం.. ఒత్తిడి ఎక్కువ అవ్వడంగా ఆరోగ్యం క్షీణిస్తుందని.. మస్క్ ఆన్ లైన్ ప్రవర్తనను రెండు సంవత్సరాలుగా పర్యవేక్షిస్తున్నట్టుగా అబ్రామ్సన్ తెలియచేశారు. ఈ వ్యక్తిగత సవాళ్లు తీవ్రమైన ప్రజా పరిణామాలకు దారితీస్తాయని అబ్రామ్సన్ హెచ్చరించాడు. అతని పిచ్చి మరియు హింసను ప్రేరేపించడం మనందరికీ అపాయం కలిగిస్తుంది అని అబ్రామ్సన్ తన పోస్ట్ లో రాశారు.
ఎలోన్ మస్క్ నుండి అమెరికాను రక్షించడానికి.. తక్షణ చర్య అవసరమని పేర్కొన్నాడు. మస్క్‌తో యుఎస్ ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయడం, రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలను నిరోధించడానికి వ్యాజ్యాలను ప్రారంభించాలన్నాడు. ప్రపంచ స్థిరత్వాన్ని బెదిరించే స్థాయికి చేరుకున్నాడని అబ్రామ్సన్ చెప్పారు. మస్క్ ఏరోస్పేస్, ఆటోమోటివ్ మరియు AI సహా ప్రపంచ నాగరికతకు సంబంధించిన అనేక కీలకమైన పరిశ్రమలలో పాల్గొంటున్నందున, అతని మానసిక ఆరోగ్యం చాలా ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
మస్క్ ప్రస్తుత ప్రవర్తన ఆందోళనకరమైనది అయ్యిందని.. టెస్లా, స్పేస్‌ఎక్స్ మరియు న్యూరాలింక్ అధిపతిగా, మస్క్ ప్రపంచ స్థాయిలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. మూడు సంస్థలను నియంత్రిస్తాడు. మస్క్ యొక్క మానసిక స్థితి అతని కంపెనీ గురించి ఆందోళనలకు మించినదని అబ్రామ్సన్ చెప్పాడు. ప్రపంచ వ్యాప్త పురోగతికి కీలకమైన పరిశ్రమల భవిష్యత్తు పై ఇది ప్రభావం చూపుతుంది అన్నాడు. అబ్రామ్సన్ చేసిన వ్యాఖ్యలు మస్క్ ఎంత శక్తివంతమైనవాడో.. మరియు అతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి అంతర్జాతీయ సంబంధాల వరకు ఏ మేరకు ప్రభావితం చేయగలడు చెప్పాడు.