21.7 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

నాటు నాటుకు మించి ఎన్టీఆర్, హృతిక్ సాంగ్..?

ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సాంగ్ టాలీవుడ్, బాలీవుడ్ నే కాదు.. హాలీవుడ్ ను సైతం మెప్పించింది. అందుకనే.. ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నాటు నాటు సాంగ్ ను మించేలా వార్ 2 లో సాంగ్ ప్లాన్ చేశారు. ఇంతకీ.. ఈ సాంగ్ షూట్ ఎప్పుడు..? వార్ 2 రిలీజ్ ప్లాన్ ఏంటి..?

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్‌.. వీరిద్దరూ కలిసి నాటు నాటు సాంగ్ కు చేసిన డ్యాన్స్ వేరే లెవెలో ఉండడంతో క్లాసు, మాసు, లేడీసు, ఫ్యామిలీసు.. అనే తేడా లేకుండా అందరికీ నచ్చేసింది. ఆస్కార్ అవార్డ్ ను సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. అయితే.. నాటు నాటు లాంటి మ్యాజిక్కే చేయాలని ట్రై చేస్తున్నాడు వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న వార్ 2 పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ మంచి డ్యాన్సర్స్. ఇక వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే.. ఇక ఆ సాంగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ సాంగ్ అప్ డేట్ ఏంటంటే.. యశ్ రాజ్ స్టూడియోస్ లో ఎన్టీఆర్, హృతిక్ పై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. 500 మంది డ్యాన్సర్ తో ఈ సాంగ్ ను షూట్ చేస్తుండడం విశేషం. నాటు నాటు సాంగ్ ను మించేలా ఈ సాంగ్ ఉంటుందని టాక్ వస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సాంగే కాదు.. ఎన్టీఆర్, హృతిక్ ల పై వచ్చే యాక్షన్స్ సీన్స్ కూడా వావ్ అనేలా ఉంటాయని సమాచారం. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ఆగష్టు 14న వార్ 2 రిలీజ్ చేయాలని ఎప్పుడో డేట్ ఫిక్స్ చేశారు కానీ.. ఇప్పుడు ప్లాన్ మారిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారని సమాచారం. మరి.. వార్ 2 మూవీతో ఎన్టీఆర్, హృతిక్ కలిసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్