సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో కల్పన, ఆమె కూతురు స్టేట్‌మెంట్స్ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. కల్పన ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన దయ .. తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఆమెది ఆత్మహత్యాయత్నం కాదని చెప్పారు. ఆమె సింగర్ మాత్రమే కాదని.. ప్రస్తుతం ఎల్‌ఎల్ బీ, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారని చెప్పారు. ఇటీవల ఇన్‌సోమ్నియాతో ఇబ్బందిపడ్డారని.. వైద్యుల సూచన మేరకు ఆమె మాత్రలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఒకింత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని దయ చెప్పారు. అంతేకానీ, ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదని… దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దని రిక్వెస్ట్ చేశారు. తమ కుటుంబమంతా సంతోషంగా ఉందన్న దయ… తమ తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారని..త్వరలోనే ఆమె ఇంటికి తిరిగి వస్తారని చెప్పారు.
కల్పన స్టేట్‌మెంట్
కల్పన స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. తన పెద్ద కుమార్తెను చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరానని.. తన మాటలను కుమార్తె పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం కేరళలో ఉంటున్న పెద్ద కుమార్తె తన మాట వినకపోవడం వల్లే తాను నిద్రమాత్రలు మింగానని పోలీసులకు చెప్పారామె. కేరళలో కాకుండా హైదరాబాద్ వచ్చి చదువుకోవాలని కోరానని.. అయితే తన మాట నిరాకరించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు కల్పన తన స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు పోలీసులు అంటున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ..గాయని నిద్రమాత్రలు మింగారని వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కల్పనకు ఇన్‌ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం గాయని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నిన్న రాత్రి ఆసుపత్రికి రాగానే కల్పనకు స్టమక్ వాష్ చేశారు వైద్యులు . లంగ్స్ లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ అవసరం అయింది. ప్రస్తుతం వెంటిలేటర్ తీసేసినట్టు తెలుస్తోంది. కొద్దిగా ఇన్‌ఫెక్షన్ ఉండడంతో ఆక్సిజన్ మీద ఉన్నారు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికి పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు