అంతర్జాతీయ వన్డేల్లో నేపాల్ క్రికెట్ జట్టు స్పిన్నర్ సందీప్ లమిచానె(Sandeep Lamichhane) ప్రపంచ రికార్డు నమోదుచేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. కేవలం 42 మ్యాచుల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఒమన్ తో జరిగిన మ్యాచులో 3వికెట్లు పడగొట్టిన సందీప్.. వన్డేల్లో వేగంగా 100 వికెట్ల మార్క్‌ని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆఫ్ఘానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్(Rashid Khan) పేరిట ఉంది. రషీద్ 44వన్డేల్లో ఈ ఘనత సాధించాడు.
కాగా గతేడాది ఓ అమ్మాయిపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ అరెస్ట్ కూడా అయ్యాడు. దీంతో అతనిపై నేపాల్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిషేధం తొలగించడంతో మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. గతంలో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడాడు.