టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఓ మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆయన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. రాయలసీమ గడ్డపై యువగళం పాదయాత్ర 1000కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని లోకేశ్ సంతోషం వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టేందుకు యువగళం ఓ ఆయుధం లాంటిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన యాత్రకు మద్దతు తెలిపిన ప్రజలతో పాటు తనకు సహకరించిన టీడీపీ శ్రేణులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. పాదయాత్రపై యువత తమ మనోభావాలను 96862-96862 నెంబర్ ద్వారా తనతో వాట్సాప్ ద్వారా పంచుకోవచ్చని లోకేశ్ వెల్లడించారు.