తెలంగాణలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థి ప్రీతి మృతి కేసులో సస్పెన్స్ వీడింది. ప్రీతిది ఆత్మహత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే ఆమె ఆత్మహత్యకు సీనియర్ సైఫ్ ప్రధాన కారణమని.. అతని వేధింపులు భరించలేకే సూసైడ్ చేసుకుందని వెల్లడించారు. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నామని.. వారం రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీట్ దాఖలు చేస్తామన్నారు. కాగా ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్ ఇటీవల బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే.