వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్ ఫామ్‌హౌస్ జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగంను విచారణ నిమిత్తం కరణ్‌కట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన సమయంలో, పోలీసుల పర్యవేక్షణలో ఉండగానే ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మహిళా కానిస్టేబుల్ సునీతతో పాటు యాలాల పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బస్వరాజ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసు శాఖలో విధుల పట్ల నిర్లక్ష్యానికి తావులేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు..
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
Latest Articles
- Advertisement -


