బుచ్చిబాబు.. నెక్ట్స్ ఏంటి..?

బుచ్చిబాబు.. పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి అటు ఆడియన్స్.. ఇటు ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు. పెద్ది కథను ఎంతగా ప్రేమించాడో.. ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ఐదేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంతో.. బుచ్చి నెక్ట్స్ ఏంటి..? అనేది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ఒకరిద్దరి స్టార్ల పేర్లు వినిపించాయి కానీ.. ఎవరితో బుచ్చిబాబు సినిమా ఉంటుందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇంతకీ.. బుచ్చిబాబు మనసులో ఏముంది..?

బుచ్చిబాబు.. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే.. బ్లాక్ బస్టర్ సాధించాడు.. 100 కోట్ల మూవీని అందించారు. ఇప్పుడు పెద్ది సినిమాతో అంతకు మించిన సక్సెస్ సాధించాడు. దీంతో బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. అయితే.. నెక్ట్స్ మూవీ కోసం బుచ్చిబాబు ఓ కథ రెడీ చేసి.. పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నాడు. ఏ హీరోతో చేస్తాడు అనేది సస్పెన్స్ గా మారింది. పెద్ది మూవీలో నటించిన చరణ్‌ నెక్ట్స్ మూవీని క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తో సినిమా చేయనున్నారు. ఆతర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చరణ్‌ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

చరణ్ లైనప్ క్లియర్ గా ఉంది కానీ.. బుచ్చిబాబు సినిమా ఎవరితో అనేది ఇంకా ఫైనల్ కాలేదు. పెద్ది సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బుచ్చిబాబు నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తారంటే.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు పేరు వినిపించింది. అయితే.. మహేష్ వారణాసి సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ఆ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఆతర్వాతే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తారు కానీ.. ఇప్పుడు ఫోకస్ అంతా మహేష్‌ వారణాసి పైనే పెట్టారని సమాచారం. పైగా మహేష్ తో సినిమా చేసేందుకు ఇద్దరు దర్శకులు వెయిటింగ్లో ఉన్నారు. సో.. మహేష్ బాబుతో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్ అవ్వదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.

చరణ్ మరో సినిమా చేస్తానని బుచ్చిబాబుకు మాట ఇచ్చారట కానీ.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా చాలా టైమ్ పడుతుంది. ఇక ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు స్టోరీ రెడీ చేసారట. ఆయన పిలిస్తే వెంటనే వెళ్లి కథ చెబుతానని చెప్పారు. ఎన్టీఆర్‌పై బుచ్చికి ఆశలు ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్ లైనప్‌ను గమనిస్తే, ఆయన చాలా కాలం వరకు బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడం దాదాపు ఖాయం. అలాగే దేవర 2 కూడా లైన్లో ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే సరికి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అందుచేత ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ కూడా ఇప్పట్లో ఉండదు. మరి.. బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది అనేది మరింత క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్