ఈ నెల 27 నుంచి బుల్లితెరపై ‘శ్రీమద్ రామాయణం’

మానవ సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే ” శ్రీ మధ్ రామాయణం”. తండ్రి మాట జవదాటని కొడుకుగా, అన్నగా, ఏకపత్నీవ్రతుడిగా,స్నేహితుడిగా, ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా, అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.

ఈ శ్రీమద్ రామాయణం సీరియల్ లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం,… లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం మొదలుకుని రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా అద్భుతమైన సాంకేతిక విలువలతో అత్యద్భుతంగా చిత్రీకరించి శ్రీ రామ గాథను జెమిని టివి అభిమాన ప్రేక్షకులందరికి ఎప్పటికి గుర్తుంది పోయేలా అందించడం జరుగుతోంది.

వాల్మీకి విరచిత రామాయణం ” శ్రీమద్ రామాయణం”గా సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటుల పెరఫార్మెన్సుతో, మనుసుని ఆకట్టుకునే డైలాగ్స్‌తో, ప్రతి తెలుగు ప్రేక్షకుడిని అలరించడానికి మే 27 వ తేది నుండి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు, ప్రతి రోజు సాయంత్రం 6. 30 నుండి 7. 30 వరకు ప్రసారం కానుంది. సీరియల్ ప్రారంభ సందర్భంగా జెమిని టివి, “జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్”ని నిర్వహిస్తోంది.

మే 27 నుండి జూన్ 1 వరకు ప్రసారమయ్యే శ్రీమద్ రామాయణం సీరియల్ ఎపిసోడ్స్ లో ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలను తెలియజేసి 1000 రూపాయిల నగదు బహుమతిని పొందే అవకాశం ఈ కాంటెస్ట్ ద్వారా లభిస్తుంది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎన్నుకుంటారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్