మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఫ్యామిలీ పంచాయితీలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న వివాదాలను పరిష్కరించడం కోసం చర్చలు జరుగుతున్నాయి . దీంతో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు. ఇక ఇదే సమయంలో తనకు తన కుమారుడైన మంచు మనోజ్ తో ప్రాణహాని ఉందని, తనకూ తన ఆస్తులకు రక్షణ లేదని మోహన్ బాబు కూడా లేఖ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ పైన ఆయన భార్య మౌనిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా మరో ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ రెండు ఎఫ్ఐఆర్ లలో ఉన్న సంచలన అంశాల విషయానికి వస్తే మనోజ్ ఎఫ్ఐఆర్లో విజయ్ రెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై మోహన్‌బాబు పనిషి సంచలన విషయాలు బటయపెట్టారు. భూమా మౌనిక ను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు కుటుంబానికి ఇష్టం లేదని తెలిపారు. గతంలోనే పెళ్లయి బాబు ఉన్న మౌనికని…పెళ్లి చేసుకోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయని తెలిపారు.