టీడీపీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేత అని అన్నారు మంత్రి నారాలోకేష్. తిరుపతిలో పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. పనిచేసే వారిని పార్టీలో ప్రోత్సహిస్తామని చెప్పారు.


