తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

తెలంగాణలో కాంగ్రెస్‌ మంచి జోష్ మీద ఉంది. బీఆర్ఎస్‌కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్‌లో చేరబోతు న్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లు చేరుకోనున్నారు. రేవంత్ నివాసంలో పార్టీలో చేరనున్న నేతలందరికీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో కడియం కావ్యను ప్రకటించే అవకాశం ఉంది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీ భవన్ చేరిక లతో కలకలలాడుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరి కొందరు హస్తం గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ తెలంగాణలో మరింత బలపడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతున్న క్రమం లో.. బీఆర్ఎస్ వీక్ అవుతూ వస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలంతా తలోదారి చూసుకుం టున్నారు.కేకే, కడియం శ్రీహరి లాంటి కీలక నేతలు పార్టీని వీడడంతో వలసలు భారీగా పెరిగే అవకశం ఉంది.

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్