మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య కాలం కలిసి రావడం లేదు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రవితేజ ఈగల్ అనే సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఈ సంక్రాంతికి మాస్ జాతర రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఈ ఇయర్ లో కూడా కుదరలేదు. ఇప్పుడు నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి ఓ మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ.. రవితేజ ఎవరితో మూవీ చేయనున్నారు..? ఈసారైనా సంక్రాంతికి రావడం సాధ్యమేనా..?
రవితేజ నటించిన ఈగల్ మూవీని గత సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్న ఈగల్ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మాస్ జాతర సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో రవితేజ కాలికి గాయాలు అయ్యాయి. దీంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ కారణంగా సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర సమ్మర్ లో మే 9న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఇప్పుడు రవితేజ కోసం క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఓ కథ రెడీ చేశాడట. కిషోర్ చెప్పిన ఈ స్టోరీకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే.. మాస్ ఇమేజ్ ఉన్న రవితేజకు.. క్లాస్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ కిషోర్ తిరుమల ఎలాంటి కథను రెడీ చేశాడు..? రవితేజను మాస్ గా చూపిస్తాడా..? క్లాస్ గా చూపిస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఈ మూవీని ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది రవితేజ ప్లాన్. ఈగల్, మాస్ జాతర చిత్రాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే కుదరలేదు. మరి.. ఈసారైనా రవితేజ సంక్రాంతి ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.