మైనర్‌ను లైంగికంగా వేధించిన ఫుట్‌బాల్ కోచ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని పల్‌ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్లేయర్‌ను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరించిపులకు గురి చేసిన ఓ ప్రైవేటు ఫుట్‌బాల్ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 36 ఏళ్ల అభిజిత్ మెండల్‌పై పోక్స్ కేసు నమోదు చేశారు.
2023లో వసైలోని తన ఫుట్‌బాల్ ట్రైనింగ్ అకాడమీలో చేరిన 17 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను చిత్రీకరించి వాటిని చూపించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఫుట్‌బాల్‌లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ముందు బైనర్ బాలికను నమ్మించాడు. తర్వాత బాలికను లోబరుచుకుని ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ వీడియోలను చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. అభిజిత్ మెండల్ బెదిరింపులకు విసిగిపోయిన బాలిక.. విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో అభిజిత్‌ను అరెస్టు చేశారు.


