పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు. ఆమె కాళ్ల పారాణి ఆరకముందే కాటికి వెళ్లింది. హైదరాబాద్‌లో 35 ఏళ్ల నవవధువు ఆతహత్య కలకలం రేపింది. ఆదివారం రాత్రి దేవిక అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త సతీశ్ కూడా టెకీయే. దేవిక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని సతీశ్.. ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు , పోలీసులకు తెలిపాడు.
హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 6 నెలల క్రితమే దేవిక, శరత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గోవాలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా దంపతులు పనిచేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కి దేవిక ఉరివేసుకోగా… నిన్న ఉదయం 10 గంటల సమయంలో భర్త శరత్ దేవిక ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు.
వరకట్న వేధింపులతోనే తమ కుమార్తె చనిపోయిందని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.