కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త చర్చకు దారితీసింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటు వెళ్లి, అనంతరం ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క కేసులో కీలక లింక్‌గా మారింది. కుక్క కదలికల ఆధారంగా చిన్నారి ఆచూకీపై ఏదైనా సమాచారం లభిస్తుందనే ఆశతో పలు కోణాల్లో పరిశీలనలు జరిగాయి. అయితే కేసు ఇంకా మిస్టరీగానే ఉన్న సమయంలో కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా, కీలకంగా భావించిన ఈ ఆధారం కూడా లేకపోవడం దర్యాప్తుకు మరింత సవాలుగా మారింది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కుక్క మృతి
0
49
Previous article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


