జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం–జీడిమెట్ల హెచ్ఏఎల్ ఏరియాలోని అద్దె ఇంట్లో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు.

జీడిమెట్ల ఎస్‌హెచ్‌ఓ నేతృత్వంలో ప్రత్యేక బృందం దాడులు చేసింది. అదుపులోకి తీసుకున్న వారి వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని తేలింది. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఏడుగురిపై నిర్బంధ, కదలికల నియంత్రణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ, ఐపీఎస్ అధికారి ఎన్. కోటి రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన వారిని మెదక్ జిల్లా జోగిపేట డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు.

చట్టపరమైన ప్రక్రియ ప్రకారం బహిష్కరణ చర్యలు ప్రారంభమయ్యాయి అవసరమైన ధృవీకరణలు పూర్తయ్యాక బంగ్లాదేశ్‌కు పంపించనున్నారు అధికారులు. అక్రమ వలసదారులపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Latest Articles

బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్