ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. తుమ్మల స్టేట్ మెంట్ రికార్డ్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao) స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. ఇందుకోసం సిట్ అధికారులు మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయ్యిందని తుమ్మల నాగేశ్వరరావు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

అప్పటి ఎన్నికల రాజకీయ పరిణామాలు, తనతో జరిగిన కమ్యూనికేషన్లు, ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానాలకు సంబంధించిన వివరాలను సిట్‌కు అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అధికారుల పాత్రపై సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
తుమ్మల వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్