న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతానికి చెందిన వినయ్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేసినట్టు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో ఆరు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొని, ఐదుగురు ముఠా సభ్యులతో రెక్కీ నిర్వహించి శనివారం ఉదయం న్యాయవాది ఇంటి నుండి బయటికి రాగానే కారుతో ఢీకొట్టాడు వినయ్. వినయ్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అరెస్ట్ చేయగా, గోవా పారిపోయిన మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యాయవాది కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు ముజహీద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌ల మీద కేసు నమోదు చేసి, బెంగుళూరు నుండి వారిని పిలిపించి విచారిస్తున్నారు పోలీసులు.
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు
0
33
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


