Kamareddy: కేసీఆర్ తో తలపడే అభ్యర్థిపై కాంగ్రెస్ సస్పెన్స్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుంచి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, మధిర నుంచి భట్టి విక్రమార్క.. బరిలో ఉంటారని ఫస్ట్ లిస్ట్ లో వెల్లడించింది. వీరితో పాటు మొత్తం 55 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 12 మంది కొత్త వారే ఉన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.

ఈసారి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. తొలి జాబితాలో ఈ పేరు లేదు. కామారెడ్డి టికెట్ కోసం ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో గడిచిన కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేదు, అలాగే కామారెడ్డి నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో కామారెడ్డి టికెట్ షబ్బీర్ అలీకే ఇస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

Latest Articles

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో 13మందిని జైలుకు పంపాం-కిరణ్‌ రిజిజు

దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు నీట్‌ పేపర్‌ లీకేజీపై స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్