సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడుపుతున్న బెల్టు షాపులు ఎత్తివేశారని అన్నారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారని కీలక ఆరోపణలు చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జగన్‌ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో అమలవుతున్న మద్యం విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో వేలంపాటలు పెట్టి బెల్టుషాపులు ఇస్తున్నారన్నారు. బెల్టు షాపులు లేని వీధి, గ్రామం లేదని మాజీ సీఎం వ్యాఖ్యానించారు. ఒక్కో బెల్టు దుకాణానికి 2 నుంచి 3 లక్షల వేలం పాట పెడుతున్నారని వెల్లడించారు. ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందేనని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందేనని వివరించారు.

ఇక ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చిందన్నారు. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తిందని..పార్టీ నాయకత్వం రంగంలోకి దిగాలని చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర లభించకపోవడం..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలన్నారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్