తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆరిఫ్ & కాలిన్స్ అటార్నీస్ మరియు కోర్ ట్రాకర్ సహకారం, ఆధ్వర్యంలో భారతీయ ఎన్.ఆర్.ఐ వారి కుటుంబానికి విజయవంతంగా నష్టపరిహార చెక్ ని అందించారు. గత ఏడాది అమెరికా, కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్‌మెంట్స్ వద్ద స్విమ్మింగ్ పూల్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన భారత విద్యార్థి మణిదీప్ కొల్లి కుటుంబానికి భారీ నష్టపరిహారం అందించడంలో విజయం సాధించారు.
ఈ నష్ట పరిహారం చెక్కును తెలంగాణ ఐటీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా మణిదీప్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరి కృషిని మంత్రి ప్రశంసించారు. విదేశాలలో ఉన్న భారత విద్యార్థుల హక్కులు మరియు భద్రతను పరిరక్షించడానికి ఇటువంటి చర్యలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.