ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు

     ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణా లకు కారణమవుతున్నది. సీట్లు దక్కని అసంతృప్త నేతలు పార్టీ వీడతున్నారు. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్‌ రెడ్డి సీఎం జగన్‌ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్‌ పార్టీ జెండా కప్పి వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వా నించారు. విజయవాడ వెస్ట్‌ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి గుడ్‌ చెప్పారు. ఈ సందర్భం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని పోతిన మనస్తాపానికి గురై రాజీనామా చేసారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం మహేష్ చివరి వరకు ప్రయత్నించారు. కానీ, పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కింది. అక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో మహేష్‌ తన అనుచరులతో కలిసి సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్