Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఢిల్లీ ఎన్నికలపై స్వతంత్ర ప్రత్యేక కథనం

    ఢిల్లీ ఓటర్ల తీర్పు ఎప్పుడు, ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. సహజంగా హస్తిన ఓటర్లు ప్రతిసారీ భిన్నమైన తీర్పు ఇస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కడితే, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరో పార్టీకి మద్దతు పలుకు తుంటారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు. ఈసారి ఢిల్లీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య జరగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తరువాత జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఇవి. ఎన్నికల్లో ప్రచారం కోసం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు.

    ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈనెల 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఏడు నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండ గా కాంగ్రెస్ పార్టీ మూడు సెగ్మెంట్లలో బరిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఉచిత విద్యుత్ , తాగునీరు సరఫరా వంటి అంశాలు కీలకమయ్యాయి. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికలకు జాతీయ భద్రత, అభివృద్ది, ప్రధాని నరేంద్ర మోడీ సమర్థత, బీజేపీ ముస్లిం వ్యతిరేకత, రాజ్యాంగం పరిరక్షణ, రిజర్వేషన్ల వంటి అంశాలు కీలకమయ్యాయి.

    చాందినీ చౌక్  ఒక కీలక నియోజకవర్గం. పాత ఢిల్లీకి చాందినీ చౌక్ కేంద్రం లాంటిది. వాస్తవానికి చాందినీ చౌక్ అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం. చాందినీ చౌక్ మార్కెట్లో దొరకని వస్తువంటూ ఉండదు. చాందినీ చౌక్ చాలా పాత నియోజకవర్గం. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిసార్లు, బీజేపీ నాలుగుసార్లు గెలిచాయి. కాగా 2014, 2019 ఎన్నికలలో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై హర్షవర్థన్ విజయం సాధించారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ. ఈసారి కమలం పార్టీ తరఫున వ్యాపారవేత్త ప్రవీణ్ ఖండేల్ వాల్ పోటీ చేస్తున్నారు. కాగా హస్తం పార్టీ టికెట్‌పై జై ప్రకాశ్ అగర్వాల్ బరిలో నిలిచారు. తూర్పు ఢిల్లీలో సంపన్నవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఢిల్లీలో అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశం తూర్పు ఢిల్లీ. ఒక్కమాటలో చెప్పాలంటే తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో కలిమిలేముల కలబోత కనిపిస్తుంది. కిందటిసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీలో బీజేపీ విజయకేతనం ఎగరేసింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి క్రికెటర్ గౌతమ్ గంభీర్ గెలిచారు. అయితే ఈసారి గౌతమ్ గంభీర్ కు బదులుగా హర్ష్ మల్హోత్రా బరిలో నిలిచారు. కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున కుల్‌దీప్ కుమార్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఓట్‌బ్యాంక్‌పై కుల్‌దీప్
ఆశలు పెట్టుకున్నారు.

     ఇక కొత్త ఢిల్లీ నియోజకవర్గం వీఐపీల అడ్డా. పార్లమెంటు భవనం, రాష్టపతి భవన్ , సుప్రీంకోర్టు, ప్రధాని నివాసం, ఇండియా గేట్  ఇవన్నీ కొత్త ఢిల్లీ నియోజకవర్గ పరిధిలోని వస్తాయి. ఈ నియోజక వర్గంలో దళితులు, ముస్లిం మైనారిటీలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కొత్త ఢిల్లీ సెగ్మెంట్ నుంచి మీనాక్షి లేఖి విజయం సాధించారు. అయితే ఈసారి మీనాక్షి లేఖికి టికెట్ లభించ లేదు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ బిడ్డ బంసూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సోమ్‌నాథ్ భారతీ బరిలో ఉన్నారు. సోమ్‌నాథ్ భారతి కి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. కాగా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఈశాన్య ఢిల్లీ. ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 2008లో ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. 2014,2019 ఎన్నికలలో ఈశాన్య ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్‌పై మనోజ్ తివారీ విజయం సాధించారు. ఈసారి కూడా మనోజ్ తివారీయే బరిలో నిలిచారు. కాగా కాంగ్రెస్ టికెట్‌పై విద్యార్థి నాయకుడు, ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్ పోటీలో ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలో బీహారీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో బీహారీ అయిన కన్హయ్య కుమార్ ను వ్యూహాత్మకంగా పోటీకి పెట్టింది హస్తం పార్టీ. ఇదిలా ఉంటే ఇరవై శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు, పూర్వాంచల్ ప్రజలే ఈశాన్య ఢిల్లీ ఫలితాన్ని శాసించనున్నారు.

   కన్నాట్‌ప్లేజ్ వంటి వాణిజ్య సముదాయాలున్న నియోజకవర్గం వాయవ్య ఢిల్లీ. కాగా విస్తీర్ణంలో వాయవ్య ఢిల్లీ బాగా పెద్దది. ఈ సెగ్మెంట్‌ను ఎస్సీలకు రిజర్వు చేశారు. కొంతకాలం నుంచి వాయవ్య ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతోంది. 2014 అలాగే 2019 ఎన్నికల్లో వాయవ్య ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం బీజేపీ తరఫున యోగేంద్ర చందోలియా పోటీలో ఉన్నారు. కాగా హస్తం పార్టీ టికెట్‌పై ఉదిత్ రాజ్ బరిలో నిలిచారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో అనేక ప్రముఖ పార్కులు న్నాయి. ఈ పార్కులతోపాటు అనేక చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలున్నాయి. ప్రముఖ మార్కెట్లు అయిన సరోజిని నగర్‌, గ్రేటర్ కైలాశ్ కూడా దక్షిణ ఢిల్లీ సెగ్మెంట్‌లో ఉన్నాయి. కిందటిసారి ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీ టికెట్‌పై రాంవీర్ సింగ్ బిధూరి పోటీలో ఉన్నారు. రాంవీర్ సింగ్ బిధూరి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గుర్జార్ల నేత సహీరాం పహిల్వాన్ పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌ను కమలనాథులు నమ్ముకుంటే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చేసిన అభివృద్ధిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు పెట్టుకుంది.

  కొత్త ఓటర్లతోపాటు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా నియోజకవర్గం పశ్చిమ ఢిల్లీ. కాగా ఢిల్లీ లోని అతి పెద్ద నియోజక వర్గం ఇది. పశ్చిమ ఢిల్లీలో కొత్త ఓటర్లు 26 వేల పైచిలుకు ఉన్నారు. కాగా ఎనభై సంవత్సరాలు దాటినవారు 50 వేల మందికి పైగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం బీజేపీ క్యాండి డేట్‌గా కమల్‌జిత్ శేహ్రావత్ బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై మహాబల్ మిశ్రా పోటీలో ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభావంపై కమలం పార్టీ ఆధారపడు తోంది. కాగా హస్తం పార్టీ మద్దతు, కేజ్రీవాల్ సర్కార్ చేపట్టిన అభివృద్ది పనులను ఆమ్ ఆద్మీ పార్టీ నమ్ముకుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కిందటసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన పలువరు అభ్యర్థులను ఈసారి బీజేపీ మార్చింది. కాగా కేజ్రీవాల్ అరెస్ట్ సానుభూతి అంశం తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆప్‌, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్