Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం

    నల్లగొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుం టుంది. రేపటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4.61లక్షల మంది ఓటరు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరాడుతున్నాయి.

   ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా, బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలపడుతు న్నాయి. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థుల బక్క జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పోటీ ఇస్తున్నారు.ఈ ఉప ఎన్నికల్లో సైతం విజయం సాధించి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శ్రమిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు గత ఏడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అత్యధిక సంఖ్యంలో ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపులో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కసితో ఉంది.

  52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధాన పోటీ BRS, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు తమ అభ్యర్థులను వెంకటేసుకుని ప్రచారం చేస్తు న్నాయి. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మూడు జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నుంచి మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థిని కలుపుకొని ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తోంది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వాగ్థానాలను గట్టున పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ అనివార్యంగా జవాబులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

   మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే అభ్యర్ధిగా తీన్మార్‌ మల్లన్నను నిలబెట్టింది. మల్లన్నను గెలిపించేందుకు పని చేయాలని పార్టీ నాయకుల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లతో రేవంత్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

   ఈనెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలని తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, తీన్మార్ మల్లన్నఎన్నిక, కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పని చేసి గెలుపునకు పని చేయాలన్నారు. మరోవైపు ఆత్మీయ సమావేశాలే ప్రచార వేదికలు వాస్తవానికి ప్రధాన పార్టీలూ గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసేందుకు ఆత్మీయ సమావేశాలను ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తమ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్స్ సహా మరికొందరు పట్టభద్రులను సమీకరించి ఒకే చోట సమావేశాలను నిర్వహిస్తున్నాయి. మరో వైపు బీజేపీ సైతం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమేందర్ రెడ్డి తన విజయం గట్టి నమ్మకంతోఉన్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీలే కాకుండా, చిన్న పార్టీల నుంచి అదే మాదిరిగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమంటే తమదే అన్న ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్