Yadadri Temple |తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం 30 రోజుల హుండీ ఆదాయాన్ని కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండప భవనంలో ఆలయ ఈఓ గీత పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. అనంతరం స్వామి వారి ఆదాయాన్ని వారు వెల్లడిస్తూ.. యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం అక్షరాల రూ.2 కోట్ల 55 లక్షల 83 వేల 999 వచ్చిందని తెలిపారు. మిశ్రమ బంగారం 91 గ్రాములు, మిశ్రమ వెండి 4 కేజీల 650 గ్రాములు వచ్చింది. ఇకపోతే విదేశీ రూపాయలు.. అమెరికా వెయ్యి 343 డాలర్లు, యూఏఈ & nbsp;95 దిరామ్స్, ఆస్ట్రేలియా 55 డాలర్స్, కెనడా 140 డాలర్స్, ఒమాన్ 200 బైసా, మలేషియా 10 రింగిట్స్, భూటాన్ 21 నెగటరమ్, క్వార్టర్ 12 రియాల్స్, సింగపూర్ 8 డాలర్లు, ఇంగ్లాండ్ 25 పౌండ్స్, యూరో 60 యూరోస్, వివిధ దేశాల విదేశీ కరెన్సీ భక్తుల ద్వారా ఆలయ ఖజానాకు చేకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు ఆలయ(Yadadri Temple ) అధికారులు పాల్గొన్నారు.
Read Also: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు వ్యక్తులు మృతి
Follow us on: Youtube Instagram