Bandi Sanjay |TSPSC క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు నిరసన దీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీక్ష చేపట్టనున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలను బండి సంజయ్ ఇదివరకే డిమాండ్ చేయగా.. ఇందులో వైఫల్యమైన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ధర్నా చేపట్టనున్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలనే డిమాండ్ లతో నిరసనకు పూనుకోనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేయనున్నారు.
Read Also: యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?
Follow us on: Youtube Instagram