ఆధునిక యుద్ధ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్షిపణులు, రాకెట్ల భారీ పరీక్షను నిర్వహించడం ద్వారా ఉత్తర కొరియా మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ప్రకారం, ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులు, సుదూర ఫిరంగి రాకెట్లు, ఏఐ-మార్గదర్శకత్వంలో పనిచేసే కచ్చితమైన క్రూయిజ్ క్షిపణుల సంయుక్త పరీక్ష నిర్వహించారు. ఉత్తర కొరియా తన వ్యూహాత్మక సంప్రదాయ ఆయుధాగారాన్ని క్రమంగా ఆధునీకరిస్తోంది. దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో ఈ ఆయుధాలను మోహరిస్తామని కూడా అది ప్రతిజ్ఞ చేసింది. ఉత్తర కొరియా వద్ద ఇప్పటికే సుదూర బాలిస్టిక్ క్షిపణులు అణ్వాయుధాలు ఉన్నాయి. వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులపై అమర్చిన ప్రత్యేక మిషన్ వార్‌హెడ్‌ల సామర్థ్యాన్ని పరీక్షించింది. సుదూర బహుళ-ప్రయోగ ఫిరంగి రాకెట్ల విశ్వసనీయతను , ఏఐ-మార్గదర్శక వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల కచ్చితత్వాన్నిసైతం ఈ పరీక్ష అధ్యయనం చేసిందని కేసీఎన్ఏ పేర్కొన్నది
ఉత్తర కొరియా సైనిక శక్తి ప్రదర్శన
0
81
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


