కాంగ్రెస్ టికెట్ కోసం వెల్లువలా దరఖాస్తులు…119 టికెట్ల కోసం 1020 అప్లికేషన్లు..!

స్వతంత్ర  వెబ్ డెస్క్:  టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన దర‌ఖాస్తుల ప్ర‌క్రియ నిన్న‌టితో ముగిసింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను ఆశావ‌హులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ మేర‌కు భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి టీపీసీసీ(Telangana Congress) ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే డ‌బ్బులు చెల్లించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. దీనిపై కొంత విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీనిని తోసి పుచ్చింది టీపీసీసీ.

ఓసీ(OC) అభ్య‌ర్థుల‌కు రూ.50,000, బీసీ(BC) అభ్య‌ర్థుల‌కు రూ. 25,000 ఫీజుగా నిర్ణ‌యించింది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే ఈ డ‌బ్బులు చెల్లిస్తేనే చెల్లుబాటు అవుతుంది. లేక‌పోతే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోమంటూ పార్టీ స్ప‌ష్టం చేసింది. దీంతో చాలా మంది అప్పులు చెసి అప్లై చేసుకున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం 9 నుంచి 10 మంది దాకా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం విశేషం. మొత్తం 119 శాస‌న‌స‌భ స్థానాల‌కు 1020 ద‌ర‌ఖాస్తులు వచ్చాయ‌ని టీపీసీసీ వెల్ల‌డించింది. ఇక ఈ మొత్తం ద‌ర‌ఖాస్తుల‌లో అత్య‌ధికంగా ఇల్లందు స్థానానికి వ‌చ్చాయ‌ని, కోడంగ‌ల్ లో త‌క్కువ వ‌చ్చిన‌ట్లు తెలిపింది. చాలా వాటికి కుటుంబానికి చెందిన వారే ద‌రఖాస్తు చేసుకునేందుకు పోటీ ప‌డ్డారు.

 

Latest Articles

టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా

మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్