డబ్బుల ఏటీఎంలు తెలుసు.. గోల్డ్ ఏటీఎంలు తెలుసు.. కానీ బిర్యానీ ఏటీఎం గురించి మీకు తెలుసా? ఏంటి బిర్యానీ ఏటీఎంలు కూడా ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు చెన్నై వెళ్లాల్సిందే. చెన్నైకి చెందిన BVK(Boy to Kalyanam) అనే సంస్థ ఈ ఏటీఎం బిర్యానీ సెంటర్ ను ఏర్పాటుచేసింది. కొలత్తూర్ లో ఏర్పాటుచేసిన ఈ బిర్యానీ ఏటఎంలో అన్ని బిర్యానీలను వేడివేడిగా అందిస్తున్నామని తెలిపింది. చికెన్, మటన్, బీఫ్ వంటి వెరైటీ బిర్యానీలను అందింస్తోంది ఈ సంస్థ. ఈ విషయం తెలుసుకున్న బిర్యానీ ప్రియులు ఎగబడుతున్నారు. బిర్యానీ ఏటీఎం దగ్గరికి వెళ్లి.. ఏటీఎం స్క్రీన్‌పై ఏఏ బిర్యానీ అందుబాటులో ఉందనే వివరాలు ఉంటాయి.. నచ్చిన బిర్యానీని సెలెక్ట్ చేసుకుని.. యూపీఐ స్కానింగ్ ద్వారా డబ్బులు చెల్లించగానే బిర్యానీ బాక్స్ బయటకు వస్తుంది. ప్రస్తుతం ఈ బిర్యానీ ఏటీఎంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.