గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి అభినందనలు తెలిపారు పవన్.