సికింద్రాబాద్‌ మెట్టుగూడ వద్ద రైలు బోగీలో మంటలు

   సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. నిలిచి ఉన్న బోగీల నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయాందో ళనకు గురయ్యారు. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు చెలరేగా యని తెలుసుకున్నారు. వారు పోలీసులకు సమా చారం అందించారు. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ ఫాం మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు, పొగలను ఆర్పి వేసారు. కోచ్ క్లీనింగ్ కి వెళ్లి ప్లాట్ ఫామ్ మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని తెలిపారు.దీనిని గుర్తించిన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివే సినట్లు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. మెట్టుగూడ వాషింగ్ లైన్ లో అగి ఉన్న ఏసీ బోగీలో మంటలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరా తీసారు. సమాచారం అందు కున్న రైల్వే అధికారులు ఘట్టానాస్థలానికి చేరుకున్నారు. అయితే బోగీలో షాట్ సర్క్యూట్ కు గల కారణా లను ఆరా తీస్తున్నారు. బోగీలో మంటల చెలరేగిన ముందు క్లీనింగ్ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిన ట్లు అధికారులు వెల్లడించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్