చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. ఏంఎస్ఏంఈ,సెర్ఫ్, ఎన్నారై విభాగం ఈ మూడు విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో చిన్న పరిశ్రమలకు ఎదురైనా సమ స్యలు పరిష్కరిస్తామని, రాయితీలు అందజే స్తామని తెలిపారు.